కమ్ కమ్ కమ్ కంగారు నీకేలనే

అతడు: కమ్ కమ్ కమ్ కంగారు నీకేలనే
నావంక రావేలనే చెలి నీకింక సిగ్గేలనే
ఆమె: నో నో నో నీ జోరు తగ్గాలిక ఆ రోజు రావాలిగా
ఇక ఆ పైన నీ దానగా నో నో నో

చరణం 1

అతడు: కోరి ఏనాడు జతచేరి ఎగతాళిగా
చేరువైనాము ఆనాడే జోడైతిని
ఆమె: ఇంత స్నేహానికి అంత ఆరాటమా
చాలులే తమరికి ఏలా ఈ తొందరా నో నొ నో

చరణం 2

ఆమె: ఏల ఈ లీల పదిమందిలో పాటలా
పరువు మర్యాదలే లేని సయ్యాటలా
అతడు: నీవు నా దానవై నేను నీ వాడనై
నీడగా నిలిచినా చాలులే నా చెలి ||కమ్||