నీవేనా నను తలచినది నీవేనా నను పిలచినది

[అతడు] నీవేనా నను తలచినది నీవేనా నను పిలిచినది
నీవేనా నా మదిలో నిలిచి హృదయము కలవరపరచినది నీవేనా...
[ఆమె] నేనేలే నిను తలచినది నేనేలే నిను పిలిచినది
నేనేలే నీ మదిలో నిలిచి హృదయము కలవరపరచినది

చరణం 1

[అతడు] కలలోనే వొక మెలకువగా ఆ మెలకువలోనే ఒక కలగా
కలయో నిజమో వైష్ణవమాయో
తెలిసి తెలియని అయోమయంలో ||నీవేనా||

చరణం 2

[ఆమె] కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పూయించి ||2||
కనులను మనసున కరగించి మైమరపించి
నన్నలరించి...||నేనేలే||