ఎందున్నావో ఈ చెలీ! అందుకో నా కౌగిలి

పల్లవి

[అతడు] ఎందున్నావో ఈ చెలీ! అందుకో నా కౌగిలి ||3||

చరణం 1

[అతడు] నిలువలేను నిముషమైన నీవులేనిదే
తిరిగిపోను వలపుతీపి తెలుసుకోనిదే
[ఆమె] ఇన్నినాళ్ళ వెతలువైచి నీకై వున్నాను
||నిలు||

చరణం 2

[ఆమె] కొంగులోన నిన్ను దాచి పొంగిపోదునా
కురులలో తురిమితురిమి పరవసింతునా
||కొంగు||

[అతడు] నీడవోలె యుగయుగాలు నీతో నీతో వుంటాను ||2||
[ఆమె] ఎందున్నావో సుందరా! నా ముందు నిలువనేలరా ||2||
[అతడు] ఇందున్నానే ఓ చెలి అందుకోవె నా కౌగిలి ||2||