పల్లవి
[అతడు] తొలివలపులలో ఏ చెలికైన అలకవుండునని విన్నాను
ఆది కవుల కల్పనను కున్నాను
ఆది కవుల పైత్యమనుకున్నను
నీలో నాపై అలకను చూసివలపు చేష్టలనుకున్నాను
[ఆమె] మాయలు చేసి మీ మగవారు మాటలు చాలా నేర్చారు
ప్రతి మగువకిలాగే చెపుతారు
ఆడది తానై చెంతకువస్తే అలిగేపనులే చేస్తారు
ఆ అలకే వలపనుకుంటారు
చరణం 1
[అతడు] కోరినవాడ్ని కొంగుముడేసి తిప్పదలచుకుంటారు
మరో మగువతో మాట్లాడగనే మూతి
ముడుచుకుంటారు మొగము తిప్పుకుంటారు
[ఆమె] ప్రేమ పేరుతో చెక్కిలినొక్క సరసమాడుతువుంటారు
నిజం తెలిస్తే భుజం తడుముకొనినే తలుపలుకుతూ వుంటారు
సాకులు చెపుతూ వుంటారు
||తొలి||
చరణం 2
[అతడు] ఆడవారు తమ అనురాగంలో అనుమానం పడుతుంటారు
లోపల మమత పైన కలతతో సతమౌతూ వుంటారు
కుతకుతలాడుతు వుంటారు
[ఆమె] తేనెటీగలో వున్న గుణాలు మగవారిలో వుంటాయి
వీలుదొరికితే వారి తలపులు దారి తప్పుతు వుంటాయి
పెడదారులు పట్టుతు వుంటాయి
[అతడు] కలలోనైన నా కన్నులలో వెలుగుతున్నది నీ రూపం
నీ అందాలను ఆరాధిస్తు పూజించడమే నా ధ్యేయం
జ్వించడమే నా గమ్యం
[ఆమె] కోరినవాడు దూరమౌదురని గుబులుపడును నా మనసు
నీ హృదయంలో నాపై ప్రేమ నిండుగా
వుందని తెలుసు అది పొంగుతుందని తెలుసు