నీవు నేను కలిసిననాడే నింగినేల కలిసేనులే

పల్లవి

[అతడు] నీవు నేను కలిసిననాడే నింగినేల కలిసేనులే
ఆమె నీవేనేనై నిలచిననాడే జీవనరాగం తెలిసెనులే
||నీవు||

చరణం 1

[అతడు] అలలై పిలిచె నీ అందాలే వలపు తేనియలు చిలికెను నాలో
[ఆమె] నీలోసాగే అనురాగాలే ||2||
వేణువులు వూదెను నాలోనాలో
||నీవు||

చరణం 2

[ఆమె] నీలోవిరసే దరహాసాలే పాలువెల్లువై పొంగెను నాలో
[అతడు] జగమును దాటి గగనము పోటీ
రేగెను ఊహలు నాలో నాలో
||నీవు నేను||