[ఆమె] కలవరమాయెను మదిలో నా మదిలో
కన్నులలోన కలలేయామె
మనసే ప్రేమ మందిరమాయె
కలవరమాయె మదిలో నా మదిలో
[అతడు] కలవరమాయె మదిలో నా మదిలో
కన్నులలోన గారడియాయె
మనసే పూలమండపమాయె
కలవరమాయె మదిలో నా మదిలో
[ఆమె] నాలో యేమో నవభావనగా
మెల్లన వీణ మ్రోగింది
అనురాగాలే ఆలాపనగా
మనసున కోయిలకూసె ||కల||
[అతడు] నాలోయేమో నవరసరాగం
పిల్లనిగ్రోవి వూదింది
మోహాలేవో మోడులు చేసింది
వూహాగానము చేసె ||కల||