కాశీకిపోయాను రామాహరి

[అతడు] కాశీకిపోయాను రామాహరి
గంగతీర్థమ్ము తెచ్చాను రామాహరి ||2||
[ఆమె] కాశికి పోలేదు రామాహరి
ఊరికాల్వలో నీళ్ళండి రామాహరి ||2||

చరణం 1

[అతడు] ఈమె మాటలు పట్టించుకోకండి
ఈ పిల్ల మా మేనకోడలు
నన్ను సంసారంలో దింపటానికికొచ్చింది
[అతడు] శ్రీశైలమెళ్ళాను రామాహరి
శివుని వీబూది తెచ్చాను రామాహరి ||2||
[ఆమె] శ్రీశైలం పోలేదు రామాహరి
శివుని వీబూదితేలేదు రామాహరి
ఇది కాష్టంలో బూడిద రామాహరి

చరణం 2

[అతడు] అన్నమక్కరలేదు రామాహరి
నేను గాలి భోంచేస్తాను రామాహరి ఉత్త గాలి భోంచేస్తాను
[ఆమె] గాలితోపాటుగా రామాహరి
వీరు గారిలే తింటారు రామాహరి
నేతిగారెలే తింటారు రామాహరి

చరణం 3

[అతడు] కైలాసమెళ్ళాను రామాహరి
నంది తన్ని పంపించాడు రామాహరి
బాగా తన్ని పంపించాడు రామాహరి

చరణం 4

[అతడు] ఆలుబిడ్డలు లేరు రామాహరి
నేను ఆత్మయోగి నండి రామాహరి గొప్ప ||2||
[ఆమె] ఆ మాట నిజమండి రామాహరి
నేను అందుకే వచ్చాను రామాహరి ||2||