చింతచెట్టు చిగురుచూడు చిన్నదాని పొగరుచూడు

పల్లవి

[అతడు] చింతచెట్టు చిగురుచూడు చిన్నదాని పొగరుచూడు
చింతచిగురు పుల్లగున్నదోయి నా సామిరంగ చిన్నదేమో
తియ్యగున్నదోయ్ నా సామిరంగా చిన్నదేమో తియ్యగున్నదోయ్
[ఆమె] చింతచెట్టు చిగురుచూడు చిన్నవాడిక్ బెదురుచూడు
చింతచెట్టు కాపుకొచ్చిందోయ్ నా సామిరంగా
చిన్నదేమో దాపుకొచ్చిందోయ్ నా సామిరంగా చిన...

చరణం 1

[ఆమె] పాలవయసు పొందుకోరి పొంగుతున్నది
నా పైట కూడ వాడిపేరే కలవరిస్తుంది
[అతడు] వగలమారి వాలుచూపు వల్లగున్నది
అది వెంటపడితే ఏదేదో వెర్రిగున్నది||చింత||

చరణం 2

[ఆమె] పగ్గమేసే పెంకితనం తగ్గనన్నది
సిగ్గుదోస్తె చిటుకులోన మొగ్గుతున్నది
[అతడు] జబర్దస్తి చేస్తుంది జబ్బమీద వాలుతుంది
అబ్బో ఆ పడుచుదనం తబ్బిబ్బు చేస్తుంది||చింత||
[ఆమె] వెన్నెమీద చిన్నవాడి కన్నుబడ్డది
అది వెన్నె విడిచి నన్ను విడిచి ంల్లనన్నది
[అతడు] ఇంతలేసి కన్నులలో మంతరిస్తది
ఆహ ఎంత దోచిన కొంత మిగులుతుంటది||చింత||
[అతడు] ఏ తోటలో విరబూసెనో ఈ పువ్వు