పల్లవి
[ఆమె] మధురం మధురం ఈ సమయం ఇక జీవితమే ఆనందమయం
[అతడు] చల్లని పున్నమి వెన్నెలలో ఎన్నడు వీడని కౌగిలిలో||2||
[ఆమె] కన్నుల వలపు కాంతలు మెరయగ||మధురం||
చరణం 1
కరిగిపోయె పెనుచీకటి పొరలు ||2||
తొలగిపోయె అనుమానపు తెరలు
పరిమళించే అనురాగపు విరులు||2||
అలరెనె మనసు నందనవనముగా ||మధురం||
చరణం 2
సఫలమాయె మన తియ్యని కలలు
యదను నిండే నవజీవన కళలు ||2||
పొంగి పొరలే మన కోర్కెల అలలు ||2||
బావియే వెలిగే పువ్వుల బాటగా ||మధురం||