ఆత్మారామా ఇది నీకు నగవా

ఆత్మారామా ఇది నీకు నగవా
రాజా ఇదేలా నవ్యో! పరాకో!
నా జీవితమ్మే చిరాకో!
నేనేమో నీకు ప్రాణమన్నావే
నీవే ప్రాణాధిపా!

అదంతా ఇదేనా - రాజా ఇదేనా
నాలో ఏదో దుఃఖాంభుదీ
పొంగైలేచే తుఫాన
నీవేనా నావనై రావె స్వామీ
ములిగి పోలికే దీనా

ఏమి జాగురా ప్రభూ
కానవే కావవే
ఏరా నా స్వామి - సుకామి
నా స్వామీ - సుకామి