ఆపద మొక్కుల వాడా - ఓ శ్రీనివాసా
అడుగడుగున కాపాడే - తిరుమల గిరివాసా
శ్రీనివాసా - శ్రీనివాసా
జనులందరు - నీ చల్లని కనుపాపలే
జగమంతా వెల్లివిరిసె - నీచూపులే
నిను నమ్మిన కొలువై ఉన్నావా
నిండు మనసు గలవారికి - నిందలు మిగిలేనా
మంచిని కోరే బ్రతుకే - మంటలపాలేనా
వెలుగు చిలికే దీపం విలవిలలాడేనా
దేవా దేవా నీకిది న్యాయమా
గుండెనిండా వెతలు దాచి - కుమిలిపోతిగాని
కొంగుసాచి ఎన్నడేమి కోరలేదు స్వామి
అతని ప్రాణములను నిలపి ఆదుకోవయ్యా
అందుకు నా ప్రాణములే అర్పించుదునయ్యా
శ్రీనివాసా -
శ్రీనివాసా -
శ్రీనివాసా -