శ్రీ రాఘవం దశరధాత్మజమప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
రామ సుగుణధామ - రఘువంశజలదిసోమ
సీతామనోభిరామ - సాకేత సార్వభౌమ
మందస్మిత సుందర వదనారవింద రామ
ఇందీవర శ్యామలాంగవందిత సుత్రామ
మందార మరందోపమ మదుర మదుర నామ
అవతార పురుష! రావణాది దీత్య విరామ
సవనీత హృదయ ధర్మనిరత రాజ లలామా
పవమాన తనయ సన్నుత పరమాత్మ పరంధామా