పల్లవి
ఎంత మధురం నీ నామం
ఎంత మోహనం నీ రూపం
ఎంత చూసినా తనివి తీరదే
ఎంత ఏడినా వేళ చాలదే
శ్రీనివాసా చిద్విలాసా
తిరుమలేశా వెంకటేశా
చరణం 1
నీ చరణకమలమంటీ
నా చూపు తిరిగి రాదే
నీమోము వెలుగు దాటీ
నా మనసు మరలి పోదే
వేళాయె నా స్వామి పవళీంతువా ఏమీ
ఈ కోవెలే నా ఇల్లయితే ఇక్కడే నేనుండి పోతే
శ్రీనివాసా చిద్విలాసా
తిరుమలేసా వెంకటేశా
చరణం 2
కలియుగములో కనిపించుదైవం నీవే
కొలిచినవారికి కొంగుబంగారం నీవే
నీ దర్శనానికి ఈ అడ్డూలేమిటి?
నేను చేరలేను స్వామీ నీవైన దిగిరావేమీ
ఏడు కొండలవాడా వడ్డీ కాసులవాడా
ఆపదమొక్కులవాడా అలిమేలుమంగా సమేత
శ్రీవెంకటేశా శ్రీశ్రీనివాసా