పల్లవి
తిరుమల మందిర సుందర
సుమధుర కరుణా సాగరా
యే పేరున నిను పిలిచేనురా
యే రూపముగా కొలిచేనురా
చరణం 1
పాలకడలిలో శేషశయ్యపై
పవళించిన శ్రీపతివో
వెండికొండపై నిండు మనముతో
వెలిగే గౌరీ పతివో
ముగురమ్మలకే మూలపుటమ్ముగ
భువిలో వెలసిన ఆదిశక్తివో
||తిరుమల||
చరణం 2
కాంతులు చిందే నీ ముఖ బింబము
కాంచిన చాలును గడియైనా
నీ గుడి వాకిట దివ్వెను నేనై
వెలిగిన చాలు ఒక రేయైనా
నీ పదములపై కుసుమము నేనై
నిలిచిన చాలును క్షణమైనా
||తిరుమల||