పండరినాధా - కనుపడినావా
బ్రతికితినేనిక ప్రభూ - విడువకే - పదదానిన్ - విఠలా
||పండ||
పాండురంగా - నిమగలువాంచెన్ - ప్రాణమెంతో - తపియించెనురా
బాధలన్నియున్ - తీరెన్‌నేటికి ప్రశాంతమాయె భావంబంతా
భవ్యయింప నీ దర్శనమాయె నోచిన నోములు - సఫలములాయె
సేవల ఫేంచె - జన్మతరించె - ప్రణామమిదియె - ప్రభూ నీదయ
||పండ||
బృందావనిలో - గోపాంగనలన్ - రాసలీలన్ - దనిపితికాదె
పండరిపురమే - బృందావనము - యమునా నదియే - చంద్రభా
భక్త బృందమే - గోపీగణము - రాసవిహారీ - రాధారమణా
దానిని మాత్రము - మరచిపోకుమా - ఆశలు తీర్చుము - అనాధనాధా
||పండ||