నీ పదముల నింక - నేవిడువ జాల
కాపాడరా - గోపాలబాలా
ఘోరసంసారాంధ - కూపంబువెడలినే
నేరీతినో నిను - జేరితి విఠలా
నీ సేవయే కోరినారా
నిను వీడి నే బ్రతుకలేరా
నీ సన్నిధినే నివసింపనీరా
నీ దాసి మన్నింపరా
శ్రీ మానినీ చిత్త బోరా
యదువీరా - భవదూరా
శ్రీరంగా - పాండురంగా
పాండురంగా - పాండురంగా