చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము

పల్లవి

[అతడు] చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము
ఉల్లాసముగా నేనూహించిన అందమె నీలో చిందెనులే||చూ||

[ఆమె] చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ పరవశము||2||
ఏకాంతముగా ఆనందించిన నా కలలే నిజమాయనులే ||చూ||

చరణం 1

ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే ||2||
చెలువములన్నీ చిత్రరచనలే ||2||
చలనములో నాట్యములే ||చూ||

చరణం 2

శరముల వలనే చతురోక్తులను చురుకుగా విసిరే నైజములే
ఉద్యానములా వీర విహారమే ||2||
చెలితో అహొసౌఖ్యములే ||చూ||