పల్లవి
[ఆమె] ఓ! చామంతి ఏమిటే ఈ వింత
ఈ చినవానికి కలిగేనేల గిలిగింతలేని పులకింత
[అతడు] ఓ...చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది
ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది వలపు పెరిగింది
చరణం 1
[ఆమె] ఇన్నాళ్ళు ఈ వలపే ఏమాయే
నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే||ఇన్నాళ్ళు||
[అతడు] ఇన్నాళ్ళు నీ హొయలు చూసాను
నా యదలోనే పదిలంగా దాచాను వేచాను ||ఓ చామంతి||
చరణం 2
[అతడు] దూరాల గగనాల నీమేడ
ఓ దొరసాని నను కోరి గిగిరావా ||దూరాన||
[ఆమె] నీ మనసే పానుపుగా వలచేను
నీ ప్రాణంలో ప్రాణంగా నిలిచాను వలచాను||ఓ చిన్నారి||