సూర్యుడే సెలవని అలసి పోయేనా

పల్లవి

[అతడు] సూర్యుడే సెలవని అలసి పోయేనా
కాలమే శిలవలే నిలిచిపోయేనా
మనిషి మనిషిని కలిపిన ఈ ఋషి
భువిని చరితని నిలిపెను నీ కృషి
మహాశయా విధి బలై తరిమెనా
మహొష్టమై వృధిరమే మరిగెనా
ఆగిపోయెనా త్యాగం కధ ఆదమరిచెనా దైవం వృధా
||సూర్యుడే||

చరణం 1

[అతడు] ఆకశం నినుగని మెరిసిపోతుంది
నేలనీ అడుగుకై ఎదురు చూసింది
చినుకు చినుకున కురిసెను నీ కల
మనస్సు మనస్సున రగిలెను జ్వాలలా
తుఫానులా ఎగిసెను ఈ ప్రవచనం
ప్రభోజ్వలా కదిలెను ఈ యువజనం
పంచభూతాలే తోడై సదా
పంచ ప్రాణాలై రావా పదా
ద్వయం భకం యజోమహే సుగంధింపు పుష్టి వర్థనం
ఉర్వానుక హిమ బంధనా వృధ్యో వృక్షియ మామృతా
||సూర్యుడే||

చరణం 2

[అతడు] స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే
ధూర్తులే అసురులై ఉరక లేస్తుంటే
యుగము యుగమున వెలిసెను దేవుడు
జగము జగములు నడిపిన ధీరుడు
మహొదయా అది నువ్వే అనుకొని
దీవంచవో నిలిచె ఈ జగతిని
మేలుకో రాదా మా దీపమై
ఏలుకో రాదా మా బంధమై
||సూర్యుడే||