పారారే పారారే పప పారేరే బండెక్కి

పల్లవి

[అతడు] పారారే పారారే పప పారేరే బండెక్కి భయం పారారే
ఛలో రే చలో రే చిందేసి చలోరే పందెం లో జయం కరారే
గుండె నరంలోకి దమ్ము రసం పంపి
కండ బలంలోనే నిప్పుగుణం నింపి
సలా సలా రావోయ్ ఓ సైనికుడై రావోయ్
సలాం సలాం కొట్టి నీ సేవకులం అవుతామోయ్
ఇలాంటోళ్ళ ముందే ఓ సైనికుడు వస్తాడోయ్
అలాంటోడి ముందే నే సేవకుడు నవుతానోయ్
||పారారే||

చరణం 1

[అతడు] రామబాణమటే నీ ఆలోచనే రావణుడు అంటే మరి నీలో చెడే
ఆంజనేయుడంటే అరె నీ సహనమే
అసలు దెయ్యమంటే అది నూకు బాబే
చెడునే వెంటనే వెంటాడి చంపరా
సహనం బెల్టుతో కోపాన్నే తెంపరా
మీసం మెలిక తిప్పి ముందుకే రా
మోసం మక్కెలిరిచి ముందరై రా
అన్నవెళ్ళే రూటుయే నమ్మడమే రైటు
నమ్మకమే ఆయుధమై నవ్వుతూ నువ్వు వచ్చావంటే ||పారారే||

చరణం 2

[అతడు] తోటి వారికోసం చెయ్యందివ్వరా ఆదుకున్న సాయం నిన్ను దీవించెనురా
దీపమల్లె నువ్వే నీ చూపివ్వరా రెండుసార్లు మొత్తం నువ్వు జీవించరా
రక్తం పంచినా కన్నోళ్ళ తీరుగా రక్తం ఇచ్చినా నిన్నే చూస్తారుగా
పదరా పంబరేపి సంబరంగా స్వార్థం బెండు తియ్యి సామిరంగా
ఎక్కడిది బాసు నీ పలుకు ఈ పంచు
వెండితెర ముందరున్నా వెన్ను తట్టే కాంచే ఉంటే
||పారారే||