పల్లవి
[అతడు] గుండెల్ని పిండేది తెలుసా ఏ స్వార్థ లేనిది తెలుసా ఏమలినం
లేనిది తెలుసా ఏ కపటం లేనిది తెలుసా ఏ బంధం లేనిదిరా అనుబంధం
అయినదిరా ప్రతిరోజు వచ్చే పచ్చని పండుగరా ప్రేమ బ్రతుకంతా నిలిచే తియ్యని
కానుకరా ప్రేమ ||గుండెల్ని||
చరణం 1
[అతడు] ఒక్కడిగా ఇద్దరు నేర్పే పాటంరా ప్రేమంటే ఇద్దరిని ఒకటిగా నడిపే
పాటంరా ప్రేమంటే రూపంలేని ఊపిరి ప్రేమా దీపంలేని వెలుతురు ప్రేమా
క్షణకాలంలో పుట్టి యుగమంతా నిలుచును ప్రేమా అణువంతే తానుండి జగమంతా
నిండెను ప్రేమా ప్రేమను కొనగల సిరి ఉంటే ఆ సిరి మళ్ళా ప్రేమేరా ||గుండెల్ని||
చరణం 2
[అతడు] హృదయాలకి నీడగా నిలిచే గొడుగేరా ప్రేమంటే గొడుగుల్లో చల్లగా కురిసే
చినుకేరా ప్రేమంటే అంతం కాని వాక్యం ప్రేమా సొంతం అయితే సౌఖ్యం ప్రేమా నీలోనే
తను పుట్టి నిన్ను తనలా మార్చును ప్రేమా నీలోనే తనుండి నిన్ను ఒకరికి పంచును
ప్రేమా ప్రేమకు మార్గం ప్రేమేరా ప్రేమకు గమ్యం ప్రేమేరా ||గుండెల్ని||