అడిగీ అడగలేక ఒక మాటే అడగనా

పల్లవి

[అతడు] అడిగీ అడగలేక ఒక మాటే అడగనా ||2||
[ఆమె] తెలిపీ తెలపలేక ఒక మాటే తెలుపనా
[అతడు] ఆశగా అడగనా నీ అడుగునై అడగనా
[ఆమె] మౌనమై తెలుపనా నీ దాననై తెలుపనా
[అతడు] ఎన్ని జన్మలైనా జంట వీడరాదని ||అడిగీ||


చరణం 1


[అతడు] నీకన్నా మెత్తనిది నీ మనస్సే నచ్చినది
[ఆమె] నీకన్నా వెచ్చనిది నీ శ్వాసే నచ్చినది
[అతడు] పెదవికన్నా సిగ్గే నాణ్యమైనది జన్మకన్నా ప్రేమే నమ్మికైనది
[అతడు] నవ్వుకన్నా సిగ్గే నాణ్యమైనది జన్మకన్నా ప్రేమే నమ్మికైనది
[ఆమె] ఎన్ని జన్మలైనా ప్రేమ మాయరదని ||అడిగీ||


చరణం 2


[ఆమె] నీకన్నా చల్లనిది నీ నీడే దొరికినది
[అతడు] నీకన్నా నిజమైంది నీతోడే నాకుంది
[ఆమె] సొగసుకన్నా ఒడివాడినది బిగుసుకున్న ముడి వీడనిది
[అతడు] ముళ్ళులేని పువ్వే ప్రేమ అయినది పూలు లేని పూజే ప్రేమ యినది
[ఆమె] ఏ జన్మలోన ప్రేమపూజ మానరాదని ||అడిగీ||