పల్లవి
[అతడు] రా రా రా రా రా రా బ్రదరూ అడుగు ముందికేస్తే లేనేలేదు ఎదురు
నువ్వు నేను మనం జనం అంతా ఇక ఒక్కటయితే ఎదుటివాడు
ఎంత కష్టాన్ని కొల్లగొడితే తప్పుసోదరు కాలే కడుపులున నిప్పు ఉందిరా
అంది అందుకుంటే ఆర్పలేని అగ్గిమంటరా
మంచిని పెంచాలి రా చెడునే తుంచాలి రా ||2||రా రా రా||
చరణం 1
[కోరస్] లాలిపాప లాలిపాప లాలిపాపల తినిపిస్తావ తినిపిస్తావ
అహొ జోహొ అనిపిస్తావా
[అతడు] కులుకుతుంటె తరుముతుంటె భయం ఒక్కటే
తిరగబడితే లొంగుతుంది లోకమొక్కటె
[కోరస్] శివ శివ శివ కాశి శివ శివ శివ శివకాశి
[అతడు] పెంచుకుంటే పెరుగుతుంది పాపమొక్కటే సాయపడితె
దక్కుతుంది పుణ్యమొక్కటే
[కోరస్] శివ శివ శివ కాశి శివ శివ శివ శివకాశి
ఊపిరిలోన ఉపకారమే ఉండాలిరా
[కోరస్] ఉండాలిలా
చెక్కిలి నిండా చిరునవ్వులే చిందాలి రా
[కోరస్] చిందాలిరా
[అతడు] అందరిలోన ఒక్కడుగా ఒక్కడివే అందిరిలా
అందరిలో ఒక్కడిగా నువ్వుండరా ఒక్కడివే అందరిలా పోరాడరా
పక్కవాడి క్షేమం కోరుకొనే జన్మం ఇక శాశ్వతమే అవుతుంది జన్మజన్మలా ||మంచిని పెంచాలి రా ||
చరణం 2
[అతడు] కష్టపడితే వస్తుంది ఫలితమొక్కటే
వేచివుంటే కరుగుతుంది కాలమొక్కటే
[కోరస్] శివ శివ శివ కాశి శివ శివ శివకాశి
[అతడు] ఇష్టపడితే మిగులుతుంది తృప్తి ఒక్కటే
పంచుకుంటే తగ్గుతుంది బాధ ఒక్కటే
[కోరస్] శివ శివ శివ కాశి శివ శివ శివ శివకాశి
[అతడు] నిన్నమొన్న జరిగిందంతా వదిలేయరా
[కోరస్] వదిలేయరా
[అతడు] నేడురేపు జరిగేదంతా నీదేనురా
[కోరస్] నీదేనురా
[అతడు] ఆటుపోట్లు ఎదురుకోని వెన్నుపోట్లు తట్టుకోని
ఆటుపోట్లు ఎదుర్కొని నిలవాలిరా వెన్నుపోట్లు తట్టుకొని గెలవాలిరా
రెప్పపాటులోనే చితికిపోయే బ్రతుకు
నువ్ మోసంతో గడిపేస్తే తప్పు సోదరా ||మంచిని పెంచాలి రా ||