వాజీ...వాజీ...వాజీ..రారాజే

పల్లవి

[అతడు] నవ్వుల్.. నవ్వుల్‌మువ్వల్...మువ్వల్ ||2||
[అతడు] పువ్వులే...నవ్వుల్‌నవ్వుల్
నవ్వల్లే...మువ్వల్ మువ్వల్
నా తీయని ఆశల పూలతడి నీ లావణ్యానికి మొక్కుబడి
నీ కాటుక కళ్ళకు జారిపడి పనిబడి ఇటు చేరితి పైనబడి
[ఆమె] వాజీ...వాజీ...వాజీ..రారాజే నా శివాజీ ||2||
చూపే కత్తి కదూ...అది నా సొత్తు కదూ
నీలో వాసన నా... తనువంతా పూసెళ్ళు
[అతడు] ఎదగుత్తులతోనే గట్టిగ గుండెముట్టి వెళ్ళు ||వాజీ...వాజీ ||పువ్వులే ||

చరణం 1

[అతడు] సిరి వెన్నెలవే - మెలిక మల్లికవే విరితేనియవే ఇక ఊ అనవే
నా కౌగిటిలో ...ఇలా...ఇలా...త్వరగా
[ఆమె] పుత్తడి బొమ్మ ఇది సుందరిని పొందులో నలిపెయ్ రా ||2||
విధికి తలవంచని రణధీరా ఎదకు ఎద సరస కలిపెయ్‌రా
[అతడు] ఓ...ఓ...మాటతో ఎందుకె చెలియా
చేతలతోనే రతీమగని ధీటునే ||వాజీ...వాజీ||పువ్వులే ||

చరణం 2

[అతడు] పసిజాణ ఇది ...తన ఊపులతో కసి తళుకులతో ... నను లాగెనులే
అందుకొందునుగా ... సుఖం సుఖం ఇంకా
[ఆమె] ఆనంద సందడిలో ... చందరుని మోముగా మలుచుకోనా
తారలిక జతులతో ఆడే వెన్నెలను వేదిక చేసెయ్‌నా
[అతడు] అరెరే...అల్లరి చేసె చిన్నది చూస్తే పాలరాతి బొమ్మలో ||వాజీ...వాజీ||పువ్వులే ||