పల్లవి
[అతడు] సహారా...శ్వాసే వీచెనో సహారా... పూవై పూచెనో ||2||
[ఆమె] సహారా...పూవై పూచెనో సహారా... శ్వాస వీచెనో
[అతడు] ఆ నింగిలో తళిక్కువై వసుంధరా దిగిరా
వెండి వెన్నెలే ఇంటికే వేంచేసెనో అవి గుండెలో తేనేకుండలో...
[ఆమె] కలయో...నిజమో...ప్రేమ మందిరమో
[అతడు] ఏ అంబరం కాంచనొ ప్రేమయే నాది చెలీ
ఏ ఆయుధం తెంచని కౌగిలి చేరు మరీ || సహానా||
[ఆమె] కలయో.. నిజమో... ప్రేమ మందిరమో
[అతడు] ఏ అంబరం కాంచని ప్రేమయే నాది చెలీ
ఏ ఆయుధం తెంచని కౌగిలి చేరు మరీ || సహానా||
చరణం 1
[ఆమె] అదేమిటో నా ఎద వరించింది
తీయగా పెదాలతో మధించి విడూ
నీ మీసమే మురిసింది ముద్దులబాకులా
మరింతగా సుఖించి విడూ
[అతడు] మోముకూ కాళ్ళకూ నునులేత వేళ్ళకూ
పూలతో దిష్టితియ్యనా బంతుల తోటలో
పూచిన జాబిలి నీవని హత్తుకొందునా
ఏ అంబరం ||సహానా||