పల్లవి
[ఆమె] వస్తవా వస్తవా మెత్తని ఓ ముద్దిస్తావా అంటాడే
ఈ మాటా రోజు రోజు ఇష్టంగా ||2||
[అతడు] మొత్తంగా మొత్తంగా మాటే మారుస్తున్నావా
నాతోటే నువ్వంటూ నేనే అన్నానంటావా
[ఆమె] నాకొంటె ఈడె
[అతడు] నాకంటె స్పీడే
[ఆమె] నాకంటి దాడే
[అతడు] నాకెంతో వేడే
[ఆమె] అబ్బాయే అబ్బో ఏమున్నాడే
[అతడు] అరె ఓ సాయెరే లేటైనా అరెఓ సాయెరే రేపైనా
అరె ఓ సాయెరే మాపైనా యెదలోనా ఆకాశానా||వస్తావా||
చరణం 1
[ఆమె] ఏదో పాపం హేండ్‌సమ్ అంటే కొండెక్కి కూర్చుంటాడు వీడే
[అతడు] అంతో ఇంతో అందం ఉంటే నన్నె ఆటాడిస్తానంటావే
[ఆమె] సింగారి చెంగే చీపొమ్మందే సందేలకు సాయం అందేవంటే
[అతడు] బంగారు అంటే కష్టం లేవే కవ్వించే ముంచి నన్నే వంచెయ్యాలే
తరతోంత తారారే వంచాలే తరరో తారరే
ముంచాలే తడిసోకు సాగరాలే ||వస్తావా||
చరణం 2
[ఆమె] కోరిందైనా తీరుస్తున్నా ఏమాత్రం ఆత్రం లేదంటాడే
[అతడు] కొంచెం కొంచెం మారుస్తావే నీలోనా చాలా మ్యాజిక్ ఉందే
[ఆమె] శృంగార ద్వీపం రమ్మంటుంటే సంకోచము మాని రావాలంతే
[అతడు] పూబంతి బాణం వేశావంటే నీఒళ్ళో వాలాలమ్మో నాలాంటోడే
[ఆమె] తరతోం తారారే బాణాలే తరరోం తారారే వెయ్యాలే
తరతోం తారారే వాలాలే ఒడిలోనా ఈ మగాడే
[అతడు] వస్తాలే వస్తాలే మెత్తని ఓముద్దిస్తాలే
ఒకే కిస్సిస్తాలే మొత్తంగా నమ్మిస్తాలే
[ఆమె] హయ్యారే హయ్యారే మారాడమ్మో కుర్రోడే
హత్తేసుకున్నాడే నాఒళ్ళోకి చేరాడే
[అతడు] నీ కొంటె ఈడే
[ఆమె] నాకంటె స్పీడే
[అతడు] నాకంటి దాడే
[ఆమె] నాకెంతో వేడే
[అతడు] అమ్మాయే అమ్మో ఏమున్నాదే