బగ బగ మండే ఆ సూర్యుడు

పల్లవి

[అతడు] బగ బగ మండే ఆ సూర్యుడు నేలకు నేరుగా
అతిధిగా వచ్చే ఓ నిప్పుల వర్షం తీరుగా
చెమటల పుట్టే ఆ మంచుకు సైతం జోరుగా
మెరుపుగా చేరే చీకట్లో కిరణం రాదా
ఏ ఎప్పుడొచ్చేస్తావే వీడే ఓ పిడుగైనాడే
నేనే పిడికిళ్ళో సంద్రం బంధించేసేస్తావే
ఏ సమరానికి కూడా వీడే కూడా వీడే సై సై అన్నాడే
నేడే ఎదురెళ్ళి తాడే పేడో తేల్చేస్తాడే


చరణం 1


[అతడు] వీడే వీడే హొరుగాలై వీచే లేచే లేచె లేచి ఉప్పెనల్లే మారే
ఉంటే ఉంటే తప్పు ఉండి ఉంటే ఎత్తి చూపి సరిచేసి తీరుతాడే
బాధల్లోనే అండై ఉండి ఆశ నింపి సాగిస్తాడే
ఓడావంటే ధైర్యాన్నిచ్చి దారే నీకే చూపిస్తాడే ||బగ||


చరణం 2


[అతడు] లేదే లేదే అడ్డూలేనే లేదే చూడే తానే ఒక యోధుడల్లే మారే
దూసెయ్ దూసెయ్ చురకత్తె చూసెయ్
దమ్మే చూపి ఇక దుమ్ము లేపుతాడే
కష్టాలుంటే తోడుంటాడే కన్నీళ్ళొస్తే తుడిచేస్తాడే
ప్రేమేపంచి ప్రేమిస్తాడే వీడే తానై లాలిస్తాడే ||బగ||