పల్లవి
[ఆమె] చమకురో చలా అల్లేసుకో ఇలా కిల్లాడి సోకుల ఓ వీరా
దినకురో దిల్లా కలుసుకో ఇలా కమ్మేసుకో మల్లా ఓ ధీరా ||2||
[అతడు] నీహొరు జోరు చూసినా కానే ఆచివేచి దారికాచి నానే
నీ ఈడు గూడు దాటినాకే నే చాటు మాట బాట వీడినానే
పిల్లా దేవుళ్ళలా తెల్లారేదాకిల్లా హూ లాలా ఆడెయ్ నాతో
రాచలీల ||చమక్కురో||
చరణం 1
[ఆమె] కల్లోకి వస్తూ ఇలా అల్లాడిపోతే ఎలా
పిల్లాడి తొందరడిలా కల్లోలం తెచ్చే చాలా
[అతడు] కన్నెతనం చూశా నీలోనే అదేదో కళా
వన్నెజాన రేపే నిషాలే భళారే భళా
భలే నచ్చాయిలే నీతో సయ్యాటలే ||చమక్కురో||
చరణం 2
[అతడు] కట్టేట్టి కన్నులతోనా చుట్టేసి పట్టేశావే
ఒట్టేసి చెప్పేస్తున్నా గుట్టంతా లాగేశావే
[ఆమె] నిన్నా మొన్నా తేడా లేదేమి చలాకి లయ
అయ్యానులే భలే దివాని ఏదో నీ దయ
పదా ఇస్తానులే నీకే వయ్యారమే ||చమకురో||