పల్లవి
[అతడు] అయ్యబాబోయ్ అమ్మాయి నడుమే సన్నాయి
మడతే చూస్తుంటే మతిపోతున్నాదే
[కోరస్] ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో
ఊకొట్టే ఉద్యోగం చెయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో
జోకొట్టే ఉద్యోగం చెయ్యాలో
[అతడు] ఏ కొంచెం కొంచెం ఊరిస్తుంటే అమ్మో నీ అందం
నిన్నేదో చెయ్యాలనిపిస్తుందే ఆపై నీ ఇష్టం
[ఆమె] ఇంచి ఇంచి చూపిస్తుంటే నీకేంటి కష్టం
ఇక నీకాకుండా ఎవరికుంది ఇంతటి అదృష్టం
[అతడు] ఓ ఇలా వయ్యారాలు ఇలా ఇన్ని విడ్డూరాలు
మరీ ఇంత దగ్గర నుంచి చూడలేండురో ||ఏ కొంచెం||
చరణం 1
[అతడు] పెదవులతో పెదవులకే కసి కసిగా ఓ వంతెన వెయ్యాలే
[ఆమె] సరసములో చేరి సగమై సుఖములకే నిచ్చెన వెయ్యాలి
[అతడు] ఆగనంటోంది ఆగనంటోంది ఆగనంటోంది
మనసే చేజారి సిద్దమవుతుంది చూడే చీరజారి
పడిపోతావు పదవే కాలు జారి || కొంచెం||
చరణం 2
[ఆమె] వయస్సు మరి చిలిపిదని తెలుసుకదా దానంతే చూడాలోయ్
[అతడు] అసలుపని కొసరుపని వదలనని నీకెట్టా చెప్పాలోయ్
[ఆమె] ఆగమవుతుంది ఆదివై వస్తారే ఆశరేపింది నువ్వే తొలిసారి
ఆదుకోవాలి గురువా ప్రతిసారి ||కొంచెం||