పల్లవి
[అతడు] ఈ రేయి నీవు నేను ఎలాగైనా కలవాలి
నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి ||ఈ రేయి||
చరణం 1
[ఆమె] ఏ మబ్బుమాటున్నావో ఏ పొదలచాటు పోతున్నావో ||2||
ఏ గాలి తరగలపైన వూగి వూగి పోతున్నావో ||2||
కలగానన్నే కవ్వించావో ||ఈ||
చరణం 2
[అతడు] చందమామలో ఉన్నాను చల్లగాలిలో వున్నాను
నీ కంటి పాపలలోనే నేను దాగివున్నాను ||2||
నీలోనీనై నిలుచున్నాను ||ఈ రేయి||
[ఆమె] ఆనాటి చూపులన్ని లోనదాచుకున్నాను ||2||
నీవులేని వెన్నెలలోన నిలువజాలకున్నాను
[అతడు] కలువే చెలియ కనిపించేను
[ఇద్దరు] ఈ రోజు నీవు నేను ఎలాగైనా ||బై||