పల్లవి
సుందరి నీవంటి దివ్యస్వరూపము
ఎందెందు వెదకినా లేదు కదా ||2||
నీ అందచందాలిక నావే కదా ||సుందరి||
చరణం 1
[ఆమె] దూరం దూరం
[అతడు] దూరమెందుకే చెలియ వరియించ వచ్చిన
ఆర్యపుత్రుడనింక నేనేకదా ||2||
మనపెళ్ళి వేడుకలింక రేపేకదా ||సుందరి||
చరణం 2
[ఆమె] రేపటిదాకా ఆగాలి
[అతడు] ఆగుమంటూ చెలియ అరమారులెందుకే
సొగసులన్నీ నాకు నచ్చేకదా||2||
నా వగలోనా విరహము మెచ్చెకదా ||సుందరి||
చరణం 3
[ఆమె] చెపితే ఎలా పెద్దలున్నారు
[అతడు] పెద్దలున్నారంటు హద్దులెందుకె రమణి ||2||
వద్దకు చేరిన పతినేకదా
నీ ముద్దుముచ్చటలింక నావేకదా ||సుందరి||