ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి

పల్లవి

[ఆమె] ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి
కో అంటూ కబురు పెడితే రగిలే కొండగాలి
ఓ అంటూ కరిగి రాదా నింగి పొంగిపొరలి

చరణం 1

[ఆమె] తనలో చినుకే బరువై కరిమబ్బే వదిలినా
చెరలో కునుకే కరవై కలవరమే తరిమిన
వనమే నన్ను తన ఒడిలో అమ్మై పొదువుకున్నదని
పసిపాపల్లె నా మదికి నమ్మకమందించిందెరో...ఎవరో...

చరణం 2

[ఆమె] వరసే కలిసే చనువైనను తబామే పూలతో
కనులే తుడిచే తల నిమిరే జాలిలో
ఎపుడో కన్న తీపికల ఎదురౌతుంటే దీపికలా
శిలలో ఉన్న శిల్పకళ నడకే నేర్చుకున్నదిలా
దుందుడుకో ముందడుగో సంగతి అడిగి వారెవరో...ఎవరో