మువ్వలా నవ్వకలా ముద్ద మందారమా

పల్లవి

[అతడు] మువ్వలా నవ్వకలా ముద్ద మందారమా
ముగ్గులో దించకిలా ముగ్ధ సింగారమా
నేలకే నాట్యం నేర్పావే నయగారమా
గాలికే సంకెళ్ళెసావే
[ఆమె] నన్నిలా మార్చగల కళ నీసొంతమా
ఇది నీ మాయవల కాదని అనకుమా
ఆశకే ఆయువు పోసావే మధుమంత్రమా
రేయికే రంగులు పూశావే

చరణం 1

[ఆమె] కలిసిన పరిచయం ఒక రోజే కదా
కలిగిన పరవశం యుగముల నాటిదా
[అతడు] కళ్ళతో చూసే నిజం నిజం కదేమో
గుండెలో ఏదో ఇంకో సత్యం వుందేమో
[ఆమె] నన్నిలా మార్చగల కళ నీ సొంతమా
ఇది నీ మాయవల కాదని అనకుమా
[అతడు] నేలకే నాట్యం నేర్పావే నయగారమా
గాలికే సంకెళ్ళేసావే

చరణం 2

[ఆమె] పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ
మరి ఒక జన్మగ మొదలవుతున్నదా
[అతడు] పూటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా
మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా
[అతడు] మువ్వలా నవ్వకలా ముద్ద మందారమా
ముగ్గులో దించకిలా ముగ్ధ సింగారమా
[ఆమె] ఆశకే ఆయువు పోసావే మధుమంత్రమా
రేయికే రంగులు పూసావే