జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం

పల్లవి

[అతడు] జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ||2||
సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే

చరణం 1

[అతడు] కవినై కవితనై భార్యనై భర్తనై ||2||
మల్లెల దారిలో మంచు ఎడారిలో ||2||
పన్నీటి జయగీతాలు కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగనిస్తూ నాలో నేనే భ్రమిస్తూ
ఒంటరినై అలవరతం కంటున్నా నిరంతరం
కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని
కాంతి కన్యల్ని ఆడపిల్లల్ని
||జగమంత||

చరణం 2

[అతడు] మింటికి కంటికి నేనై కంటను మంటను నేనై ||2||
వంటల మాటునా వెన్నెలనేనై వెన్నెల పూతల మంటను నేనై
రవినై శనినై దైవమై నిశిమై నాతో నేను సాహగమిస్తూ నాతో నేనే శ్రమిస్తూ
ఒంటరినేఇ ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని
కిరణాల హరిణాల్ని పరిణాల చరణాలన్ని చరణాల
చలనాల కనరాని గమ్యాల కాలాన్ని ఇంధ్రజాలాన్ని
||జగమంత||

చరణం 3

[అతడు] గాలి పల్లకిలోన తరలిన పాత పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయిన గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి నా హృదయములో ఇది సేనే వాలి
||జగమంత||