పల్లవి
[అతడు] దూరంగా ఉంటావెందుకు బొమ్మా దగ్గరగా రావలెనమ్మా
ఇద్దరికి మంచిదిలెమ్మా
[ఆమె] గారంగా అడిగావంటే చుమ్మా ఇద్దామనుకున్నా నమ్మా
ఆపైనే ఇష్టంలేమ్మా
[అతడు] అందన మెత్తకులే
[ఆమె] తొందర దేనికిలే
[అతడు] నీతో కష్టమిలే
[ఆమె] నువ్వో పోకిరివే ||దూరంగా ||
చరణం 1
[అతడు] కాకి పిల్లా కుక్క తోటి కయ్యాలడేనమ్మా అమ్మా
ఎలక పిల్లా ఏనుగు తోటి దెబ్బలాడేనమ్మా అమ్మా
[ఆమె] ఎవడిచ్చాడో అంతటి ధైర్యం ఎలకకి కాకికి
[అతడు] ప్రేమలో పడితే అంతే లేమ్మా ఆశ్చర్యం దేనికి
నరం నరంలో స్థిరంగా ఎండేజ్వరం కదా ప్రేమ
గరం గరంగా గుండెలోన తన పేరు చెకుప్రేమ
||దూరంగా ||
చరణం 2
[అతడు] తేనెటీగ పువ్వుతోటి ముద్దు లాడేనమ్మా అమ్మా
కనికి పుల్ల పలక మీద దిద్దులాడేనమ్మా అమ్మా
[ఆమె] చిచ్చు బుడ్డి ఎండుగడ్డి దూరం గుండాలమ్మా
ఆకు ముల్లు దగ్గరకొస్తే కొంపలు కొల్లేరమ్మా
[అతడు] తపస్సు చేస్తే తధాస్తు అంటూ వరించదా ప్రేమా
వద్దన్నా కొద్ది వెంటాడి నిన్ను చంపుతుంది ప్రేమా ||దూరంగా ||