పల్లవి
[ఆమె] వస్తవా వస్తవా ఒక్కసారి వస్తావా
వస్తవా వస్తవా వాటమైనదిస్తావా
తొలి తొలి తొలి తొలి కోడి కూత కొత్తగా
చలి చలి చలి చలి మంట రాసి పోతవా
వెనక వెనకపడి వెంట తీసుకెళ్తవా ||వస్తవా||
చరణం 1
[ఆమె] బుర బుర పొంగుతున్న బుగ్గ కొరికిపెడతవా
సల సల కాచుకున్న సోకు బైట పెడతవా
కిత కిత మన్న చిన్న నడుము మడత ముడతవా
కిట కిట లాడుతున్న తళుకు తలుపు తడతవా
కిందికి వస్తవా కాలి గజ్జె కడతవా
ముందుకు వస్తవా ముందు దెబ్బకొగతవా
ఎర్రని తేలు లాగా ఎక్కడో కుడతవా ||వస్తవా||
చరణం 2
[ఆమె] భగ భగ నిప్పులోన నీళ్ళు నువ్వు పోస్తవా
బంగరు చెంబులోన పాలు నువ్వు తీస్తవా
పరువపు డప్పు మీద దరువు నువ్వు వేస్తవా
పట్టిన తుప్పు వదిలి పోయేలాగా చేస్తావా
రైకకి చెప్పిచు కోక చేను మేస్తవా
కోకకి చెప్పుచు రైక పంట కోస్తవా
అయ్యకి తెలియకుండా పంబ అనిపిస్తావా ||వస్తవా||