పల్లవి
[అతడు] ఖబడ్దారని కబురుపెట్టారా గుబులుపట్టదా చెడుగుండెలో
మెతక దారిని తగలబెట్టరా వగలుపుట్టదా నడిరాత్రిలో
[కోరస్] ఓహు ఓహు ఓహుఓఓఓ
[అతడు] పిరికిగ పరుగు తీస్తావా
[కోరస్] ఓహు ఓహు ఓహుఓఓఓ
[అతడు] పొగరుగ పోరు చేస్తావా
[కోరస్] ఓహు ఓహు ఓహుఓఓఓ
[అతడు] నలుగులో నక్కి ఉంటావా
[కోరస్] ఓహు ఓహు ఓహుఓఓఓ
[అతడు] ఎవరికి చిక్కనంటావా
[అతడు] యముడే తరుముతుంటే ఎక్కడున్నా కంటపడవా
కతం కతం కతం కతం కతం కత కతం కతం ||2||ఖబడ్దారని||
చరణం 1
[అతడు] నీపేరే సమరశంఖమై వినిపించని విద్రోహులకి
ఆయువు తోడేసే యముడిపాశమే అనిపించని అపకారికి
[కోరస్] ఓహు ఓహు ఓహుఓఓ
[అతడు] పిడికిలి ఎత్తి శాసించు
[కోరస్] ఓహు ఓహు ఓహుఓఓ
[అతడు] పిడుగుని పట్టి బందించు
[అతడు] యుద్దం తప్పదంటే బ్రతుకు బద్మవ్యూహమై
కతం కతం ||ఖబడ్దారని||