ఏమంటారో ఈ బంధాన్నీ

పల్లవి

[అతడు] ఏమంటారో ఈ బంధాన్నీ ఏమో ఏమోనండీ పేరేదో మీరే చెప్పండీ
[ఆమె] ఎవ్వరికెవ్వరు ఏమి కానీ పోల్చే దారే లేని ఈ బంధం ఏమై ఉంటుందీ
[అతడు] కనురెప్పమూసేస్తే కనుపాప నిదరోతే గుండెల్లో హాయి ఎందుకూ
[ఆమె] నిరువుళ్ళ సవ్వడికే పురివిప్పి ఆడవులే ఎందుకలా నర్తించూనూ
[అతడు] ఏమంటారో...పయనించే ఎన్నో పక్షులకీ ఊగేటి రెక్కలకీ
ఆ ఆధారం వీచే చిరుగాలి ఆ బంధం ఏమని పిలవాలీ

[ఆమె] పువ్వులకీ, నవ్వులకీ ఈ ఈ రంగులకీ మబ్బులకీ
[అతడు] ఓయి ఓయ్ సోకులకి చాంగులకీ హాయ్ హాయ్ జాములకీ జంకలకీ
[ఆమె] లేకున్నా ఈబంధం ఉందేదో సంబంధం చూస్తున్నా
[అతడు]ఏమంటారో...
[ఆమె] ఈ సిగ్గొచ్చి వయస్సును తరిమేస్తే, చెక్కిళ్ళే ఎరుపెక్కే ఏమిటో
ఆ ఏముందో ఈ రెండిటికీ బంధం, తేల్చి చెప్పాలంటే కష్టం

[అతడు] ఈ ఈ మనస్సులకీ, మమతలకీ ఆ ఆ స్వరములకి మధురిమలకీ
[ఆమె] ఓయ్ ఓయ్ వేకువకి కోయిలకీ హాయ్ హాయ్ చూపులకి ప్రేమలకీ
[అతడు] మన మనస్సుకి అందనిది అనుబంధం ఒకటుందీ కలిపిందీ అది హరివిల్లండీ
[ఆమె] ఏమంటారో...
[అతడు] ఎవ్వరికెవ్వరు