ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలెన్నో

పల్లవి

[అతడు] ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలెన్నో ఆపవచ్చు
ఒక చిన్ని నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చు ||2||
చిరునవ్వుల దీపం వెలిగించు
నీ బాధలకి ఈగతి తొలగించు
చిరునవ్వుల బాణం సముధించు
శత్రువులే ఉండరు గమనించు
మనిషన్నోడే తనవారిని కూడ నవ్వించు
మనున్నోడే నీ నవ్వులు చూసి దిగివచ్చు
పైనున్నోడే నీ నవ్వులు చూసి దిగివచ్చు
నీతో పాటే తన కష్టం మరవచ్చు

చరణం 1

[అతడు] నీ గుండెల్లోనా గాయాలెన్నున్నా పెదవుల్లో నవ్వేవాటికి మందు
నీ కన్నుల్లోనా కన్నీరెంతున్నా అదరాల నవ్వే వాటికి హద్దు
తర్వాత నిను చూసి నవ్వే వాళ్ళు నివ్వెర పోయేట్టు
సరిగా నీనవ్వులు నిచ్చెన చేసి ఎక్కరా పై మెట్టు
నీ కోపం నువ్వే కరిగించు నీ రూపం నువ్వే వెలిగించు
నీ పాఠం నువ్వే పాటించు పది మందికి నువ్వే చాటించు
||ఒక చిన్ని||

చరణం 2

[అతడు] ఏడ్చేవాళ్ళుంటే ఇంకా ఏడ్పించి కసి తీరా నవ్విస్తుంది లోకం
నవ్వేవాళ్ళుంటే నవ్వులు నడియించి కడుపారా ఏడుస్తుంది కాలం
నకుకే లోకాన్ని ఎదిరించేటి మార్గం కనిపెట్టు
వదిలే కాలాన్నే ఎదురీదేటి ధైర్యం చూపెట్టు
ఈ జీవిత సత్యం గుర్తించు ఆనందం నువ్వే చిగురించు
నీ చలనం నువ్వే గమనించు సంచలనం నువ్వే సృష్టించు
||ఒక చిన్ని||