జాబిలికి వెన్నెలతిస్తా మబ్బులకి

పల్లవి

[అతడు] జాబిలికి వెన్నెలతిస్తా మబ్బులకి మెరుపులనిస్తా
పువ్వులకి పరిమళమిస్తా వాగులకి వరదలనిస్తా
[ఆమె] గాజులకి చేతులనిస్తా గజ్జెలకి పాదాలిస్తా
కాటుకకి కన్నులనిస్తా మాటలకి మౌనాన్నిస్తా
[అతడు] ఊరు పేరు తెలియని వాటికి ఏవేవో ఇచ్చి
[ఆమె] నీకు నా మనసిస్తా మనస్సులో చోటిస్తా
[అతడు] నీకు నా ముద్దిస్తా ప్రేమనే ముద్రిస్తా ||జాబిలికి||

చరణం 1

[ఆమె] అంత సిగ్గు నీ కివ్వని నీ అల్లరి కిస్తాను
కౌగిలింత నీ కివ్వని నీ పొగరుకి ఇస్తాను
[అతడు] కొంటె కబురు నీ కివ్వని నీ ఊపిరి కిస్తాను
పంటి పదును నీ కివ్వను నీ పెదవికిస్తాను
[ఆమె] ఇన్నిన్నాళ్ళు దాచుకున్నా కన్నెతనం నీ కివ్వను ||2||
కొన్నినాళ్ళు వేచివున్నా నీ కుర్రతనానికి ఇస్తా
[అతడు] నీకు నా చెలిమినిస్తా చెలిమిలో చనువిస్తా
కొద్దిగా అలుసిస్తా పూర్తిగా విలువిస్తా
||జాబిలికి||

చరణం 2

[అతడు] వలపు ఎరుపు నీ కివ్వను నీ పాపిట కిస్తాను
చిలిపి ముడుపు నీ కివ్వను నీ చీకటి కిస్తాను
[ఆమె] యెదను వలిచి నీ కివ్వని నీ దోసిలి కిస్తాను
ఎదురు చూపులే నీ కివ్వను నీ వాకిలి కిస్తాను
[అతడు] మండపాన కోరుతున్నా మూడుముళ్ళు నీ కివ్వని ||2||
గుండెలో నా చేరుకున్నా నీ ఏడుజన్మలకు ఇస్తా
[ఆమె] నీకు నా మనవిస్తా మరువుతో దరువిస్తా
తనువుతో చనువిస్తా తనివినే తీరుస్తా
[అతడు] నీకు నా మనసిస్తా మనస్సులో చోటిస్తా
నీకు నా ముద్దిస్తా ప్రేమనే ముద్రిస్తా
[ఆమె] నీకు నా చెలిమిస్తా చెలిలో చనువిస్తా
కొద్దిగా అలుసిస్తా పూర్తిగా విలువిస్తా
||జాబిలికి||