కెరటం

రంగురంగుల బొమ్మను
బాలలు ఆడే బొమ్మను
నాట్యము చేసే బొమ్మను
ఎరువు, తెలుపు బొమ్మను

చిందులువేసే బొమ్మను
చిలిపిగచూసే బొమ్మను
నీలం,పసుపు బొమ్మను
చప్పట్లుకొట్టే బొమ్మను

ముద్దుగమాట్లాడే బొమ్మను
చక్కదనాల చుక్కను
అందాల బొమ్మను
రంగురంగుల బొమ్మను
ఆటలు ఆడేబొమ్మను