మా మంచి అమ్మ

మా అమ్మ చెప్పేది మా మంచి మాటలు
మా అమ్మ పాడేవి ఇంపైన పాటలు
మా అమ్మ చేతివి కమ్మనీ వంటలు

మా అమ్మ తినిపించు గోరుముద్దలు
లాలపోసే టప్పుడు ప్రేమనే చూపు
నిద్ర పోయేటప్పుడు లాలి పాడు

ముద్దు మాటలు నేర్పి,
ముద్దులను ఇచ్చు
మా ఇంటిదీపమని,

మరీ మరీ పలుకు
చక్కని కధలను వివరించు అమ్మ
చక్కగా చదవమని కోరేను అమ్మ

చిన్నారి పాపనని పొగిడేను అమ్మ
చిరునవ్వు దీవెనలు అందించు అమ్మ