వచ్చిపోవే, వచ్చిపోవే
పిచ్చుకమ్మా వచ్చిపోవే
కొయ్య ముక్కలు గూడు చేశా
రేకు ముక్కను తలుపు చేశా
మెత్త మెత్తని ఈకలెన్నో
గూటి నిండా పరచి ఉంచా.
గ్రుడ్ల నిక్కడ పెట్టుకుంటే
పొదిగి పిల్లల చేసుకుంటే
కాకి పోరూ గ్రద్ద పోరూ
పిల్లి పోరూ ఉండ వింకా
ఈగ నైనా వాల నీయను
దోమనైనా దూర నీయను
నచ్చితేనే, మెచ్చితేనే
వచ్చి గూట్లో ఉండి పోవే