చేతిలో చెయ్యేసి చెప్పుబావ

[ఆమె] చేతిలో చెయ్యేసి చెప్పుబావ
చేసుకున్న బాసలు చెరిగిపోవని మరచిపోనని
[అతడు] చేతిలో చెయ్యసి చెప్పురాధ
చెప్పుకున్న వూసులు మాసిపోవని మారిపోవని||చేతిలో||

చరణం 1

[ఆమె] పాడుకున్న పాటలు పాతబడిపోవని
చిలిపిగ ఆడుకున్న ఆటలకు అలుపు రానివ్వనని
[అతడు] పడుచుగుండె బిగువులు సడలిపోనివ్వనని
దుడుకుగ ఉరికిన పరువానికి ఉడుకు తగ్గిపోదని||చేతిలో||

చరణం 2

[ఆమె] కన్నెగ కన్న కలలు కథలుగా చెప్పాలి
[అతడు] మనకథ కలకాలం చెప్పినా కంచి కెళ్ళకుండాలి||కన్నె||
[ఆమె] మన జంట జంటాలకే కన్ను కుట్టు కావాలి ||2||
[అతడు] ఇంక ఒంటరిగా ఉన్నవారు జంటలైపోవాలి||చేతిలో||