ఎట్టాగోఉన్నాది ఓలమ్మి

[అతడు] అరెరెరెరె ఎట్టాగోఉన్నాది ఓలమ్మి ఏటేటో అవుతుందే చిన్నమ్మి||2||
[ఆమె] అరెరెరెరె అట్టాగే ఉంటాది ఓరబ్బీ ఏటేటో అవుతాది చిన్నబ్బి||2||

చరణం 1

[అతడు] మొలలోతు మొగ్గల్లె నీవుంటే
నీ ఒంటి నిగనిగతో నీళ్ళు మెరుస్తుంటే
పొదచాటున్నా నేను మాటేసి చూస్తుంటే
నువ్వు స్నానాలు ఆడేవు ఓలమ్మి నా ప్రాణాలు తీసావు చిన్నమ్మి||ఎట్టా||

చరణం 2

[అతడు] మొగ్గలు ఒక్కొక్క రేకు విప్పుకున్నట్టు
నీ చక్కదనాలు నేనొకటి చూశాను
జడ చూస్తి జబ్బల నునుపు చూస్తి
కనరాని ఒంపులన్ని ఓలమ్మి కసికసిగా చూస్తినే చిన్నమ్మి||అరె||

చరణం 3

[అతడు] తడిసి నీ తెల్లకోక టపటపమన్నది
తడబడి నా గడుసు మనసు దడదడమన్నది
కళ్ళుమూసి కొస్తినని గొల్లున నువ్వు నవ్వితే
చురకల్లే తగిలింది ఓలమ్మి ఉడుకెత్తి పోయింది చిన్నమ్మి||అరె||