ఓహొ బస్తి దొరసాని బాగా ముస్తాబయ్యింది

పల్లవి

[ఆమె] ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యింది
అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ||ఓహో||

చరణం 1

ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది
పూలదండతో బాటె మూతికూడ ముడిచింది||2||
హైయ్ నాపై కోపం వచ్చింది వచ్చిన కోపం రెచ్చింది
అందచందాల వన్నెలాడి అయినా బాగుంది||ఓహో||

చరణం 2

కొత్త పెళ్ళికూతురు మదిలో కొసరి సిగ్గువేసింది
మత్తు మత్తు కన్నులతో మనసుతీర చూసింది||కొత్త||
హోయ్ ఆమెకు సరదావేసింది జరిగి దగ్గరకొచ్చింది
అందచందాల వన్నెలాడి కోపం పోయింది||ఓహో||