[అతడు] గోరంక గూటికే చేరావు చిలక||2||
భయమెందుకే నీకు బంగారు మొలక
చరణం 1
ఏ సీమదానివో ఎగిరెగిరి వచ్చావు
అలసి వుంటావు మనసు చెదరి వుంటావు
మా మల్లెపూలు నీకు మంచి కథలు చెప్పునే||2||
ఆదమరచి ఈ రేయి హాయిగా నిదురపో||గోరంక||
చరణం 2
నిలవలేని కళ్ళు నిదురపొమ్మన్నాయి
దాగని చిరునవ్వులు వద్దన్నాయి అబ్బ వుండనన్నాయి
పైట చెంగు రెపరెపలు పద పద లెమ్మన్నాయి||2||
పలుకైన పలుకవా బంగారు చిలక||గోరంక||