హల్లో సారు బలేవారు చెలి వలపు తెలుసుకోరు

పల్లవి

[ఆమె] హల్లో సారు బలేవారు చెలి వలపు తెలుసుకోరు
పైకెంతో చల్లనివారు తమరెంతో అల్లరివారు నా మనసు దోచినారు
[అతడు] చాలు చాలు సరసాలు ఇక దూరంగ ఉంటేనే మేలు||ల్లల్లల్లల్ల||

చరణం 1

రానిమ్ము రానిమ్ము ఏమైకాని
నా ఇంపు నా సొంపు నీ సొమ్ము కాదా||2||
నా తోడు నీవై నీ నీడ నేనై
కలవాలి కరగాలి కావాలి ఒకటిగా ||చాలు||

చరణం 2

రావాలి రావాలి సరియైన అదను
ఆనాడు ఇవ్వాలి నీ నిండు మనసు
ఆలోగ నీవు ఆశపడకు
ఆకాశసౌధాలు నిర్మించరాదులే||రావాలి||

చరణం 3

అనురాగ బంధాలు సడలించవద్దు
పెనవేయు హృదయాలు విడదీయవద్దు
నీ లేతవలపు ఆమోదమైన బంగారు స్వప్నాలు
పండేది ముందెప్పుడో|| హలో ||