లాలూదర్వాజా కాడా గోల్కొండ కోట

పల్లవి

[అతడు] లాలూదర్వాజా కాడా గోల్కొండ కోట కాడా
యమునా తీరాల కాడా మోగుతుందిలే భాజా
ఇటలీ, ఇంగ్లాండులైనా మనహిందు దేశమైనా
ఈ ప్రేమ కధలే ఒకటే ఊరు వాడలేవైనా
గోవిందా గోవింద ఏమైనా బాగుందా
ప్రేమిస్తే పెద్దోళ్ళంతా తప్పులెంచుతారా
గోపాలా గోపాలా ఏందయ్యో ఈ గోలా
ఆనాడు ఈ పెద్దోళ్ళు కుర్రవాళ్ళు కారా ||లాలూదర్వాజా||


చరణం 1


[అతడు] కన్ననాడు అడిగామా పెంచడానికి అడిగామా
గోరుముద్దలు పాల బువ్వలు అడిగిపెట్టీనామా
మేముతాగు అన్నామా వేలు ఎత్తి చూఫామా
నమ్మరైన మీ కన్నప్రేమలో వంకలు వెతుకుతామా
అంతగౌరవం మాపై ఉంటే ఎందుకింత డ్రామా
ప్రేమ మత్తులో కన్నబిడ్డకే మేము గుర్తురామా
పాతికేళ్ళిలా పెంచారంటూ తాళి కట్టిపోమా
వందయేళ్ళ మా జీవితాలకే శిక్ష వేసుకోమా
అందుకే లవ్ ఈట్ లైఫ్ బ్యూటిఫుల్ ||2|||లాలూదర్వాజా||


చరణం 2


[ఆమె] వేణుగానలూర వేగములు రారా నిలిచెను ఈ రాధా నీ కోసమే
వెన్న దొంగ రారా ఆలసించవేరా పలికెను నోరార ఈ నామం
ఉన్న చెట్టు నీడలోనా కన్నెలాగా వేచి ఉంది
కన్నెరాధ గుండెలోన చిన్ని ఆశ దాగి ఉంది
చిన్ని ఆశ దాగి ఉంది
[అతడు] ప్రేమ ప్రేమ అంటారు ప్రేమకోటి రాస్తారు
ఈడు వేడిలో వాస్తవాలను మీరు తెలుసుకోరు
లొల్లి లొల్లి చేస్తారు లవ్‌దు స్పీకరేస్తారు
ప్రేమ జంటని పెద్ద మనస్సుతో మీరు మెచ్చుకోరు
ఎంత చెప్పినా మొండివైకరి అసలు మార్చుకోరు
ప్రేమ ముఖ్యమో మేము ముఖ్యమో తెల్చుకోండి మీరు
కన్న ప్రేమని కన్నెప్రేమని పోల్చి చూడలేము
రెండు కళ్ళలో ఏది ముఖ్యమో తెల్చి చెప్పలేము
లవ్ ఈజ్ లైఫ్ బ్యూటిఫుల్ || 2 ||