పల్లవి
[అతడు] నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నామది ఇపుడైనా
ఎవ్వరు ఎదురుగా వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చూపులనొదిలేనా
ఎందరితో కలిసున్నా నేను ఒంటరిగానే ఉన్నా
నువ్వు వదిలిన ఈ ఏకాంతంలోనా
కన్నులు తెరిచే ఉన్నా నువ్వు నిన్నటి కలవే అయినా
ఇప్పటి ఆ కలలోనే ఉన్నా ||నమ్మక ||
చరణం 1
[అతడు] ఈ జన్మంతా విడిపోదు ఈ జంట అని దీవించిన గుడి గంటను
ఇక నామది వింటుందా
నా వెనువెంటా నువ్వే లేకుండా రోజు చూసినా
ఏ చోటైనా నను గుర్తుస్తుందా
మునుపన నను తడిమి అలా
వెనుదిరిగిన చెలిమి అలా తడి కనులతో నిను వెతికేది ఎలా || నమ్మక ||
చరణం 2
[అతడు]నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నాళ్ళైనా సంతోషంగ
గడిచాయనుకోనా
నా ఊహల్లో కలిగే వేదనలో ఎన్నాళ్ళైనా ఈ నడిరాతిరి గడవదు
అనుకోనా
చిరు నవ్వుల పరిచయమా సిరిమల్లెల పరిమళమా
చేజారిన ఆశల తొలివరమా ||నమ్మక ||